హుస్నాబాద్: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ అన్నారు. సోమవారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల బారిన పడిన వారిని నేరస్తులుగా చూడకుండా, సరైన వైద్యం, కౌన్సిలింగ్ నిర్వహించి వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్‌ఎస్ రాజు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారి రణధీర్, అద్యాపకులు పాల్గొన్నారు.
బెజ్జంకిలో..
బెజ్జంకి(సిద్దిపేట): పీఎంశ్రీ మాడల్ స్కూల్‌లో సోమవారం నషా ముక్త్ యువ యాత్ర నిర్వహించారు. ప్లకార్డులు, పోస్టర్‌లను ప్రదర్శించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఖలీదా శిరీన్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగం, అక్రమ రవాణల వచ్చే దుష్పరిణామాలను వివరించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


