‘సర్‌’ పేరుతో ఓట్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ పేరుతో ఓట్‌ చోరీ

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాల్సిందే డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ నాయకుల నిరసన

సిద్దిపేటరూరల్‌: సర్‌ పేరుతో ఓట్‌ చోరీ జరుగుతోందని, దేశంలో ఇప్పటికీ 13కోట్ల మంది ఓటర్ల పేర్లు తీసేశారని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ నాయకులు నిరసన చేపట్టి జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ సర్‌ ప్రక్రియలో బీజేపీకి అనుసంధానంగా కేంద్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహరిస్తున్నారన్నారు. అంతకుముందు నిరసనలో భాగంగా కార్యకర్తలు భారీగా చేరుకుని కలెక్టరేట్‌లోకి పరుగెత్తారు. ప్రజావాణి కార్యక్రమం వద్దకు చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ దరిపల్లి చంద్రం, టీపీసీసీ సభ్యులు తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌, తిరుపతిరెడ్డి, నాగరాజు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మ దహనం

సిద్దిపేటకమాన్‌: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ తీరుకు నిరసనగా సిద్దిపేట పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద సీఈసీ దిష్టిబొమ్మను కాగ్రెస్‌ శ్రేణులతో కలిసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఓట్‌ చోరీ జరుగుతోందని గతంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ చెప్పిన విషయం నిజమైందన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ దేశద్రోహానికి పాల్పడిన జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని, అయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement