రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య | - | Sakshi
Sakshi News home page

రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

● ఇప్పటి వరకు 60 కేసులు నమోదు ● గ్రామీణప్రాంతాల్లోనే అత్యధికం ● ఆందోళన చెందుతున్న జిల్లా వాసులు

చీకటి పడేముందు ఇంటి తలుపులు, కిటికీలు మూసేస్తే దోమలు ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు.

నిత్యం వేడి ఆహారం తినాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.

ఏదైనా తినేముందు ప్రతి సారి చేతులు శుభ్రం చేసుకోవాలి.

వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలి.

గృహాల్లోని పూల కుండీలు, కూలర్లు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

దోమ తెరలు వినియోగించాలి.

● ఇప్పటి వరకు 60 కేసులు నమోదు ● గ్రామీణప్రాంతాల్లోనే అత్యధికం ● ఆందోళన చెందుతున్న జిల్లా వాసులు

ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 60 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడా నీటి నిల్వలు ఏర్పడ్డాయి. ఇందులో దోమలు వృద్ధి చెంది.. విష జ్వరాలు వ్యాప్తికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సాధారణ వ్యాధులతో పాటు డెంగీ భూతం భయపెడుతోంది.

–సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్‌

వానాకాలం.. వ్యాధులకు అనువైన కాలం. వర్షాలు కురిసిన తర్వాత నీరు నిలిచి ఉండంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. పీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రి, జీజీహెచ్‌లకు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు జ్వర పీడితుల తాకిడి పెరిగింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 60 డెంగీ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతుండగా.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వీటి సంఖ్య లెక్కేలేదు. జ్వరం రాగానే స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలను సంప్రదిస్తున్నారు. ఆర్‌ఎంపీని సంప్రదించిన జ్వరం తగ్గకపోతే కొందరు ప్రభుత్వ, మరికొందరు ప్రైవేట్‌ ఆస్పత్రుల బాట పడుతున్నారు.

వారంలో

22 కేసులు

ఇప్పటి వరకు 60 డెంగీ కేసులు నమోదు కాగా ఈ వారం(ఈ నెల 15 నుంచి 22వరకు) 22 మంది డెంగీ బారీన పడ్డారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. మిర్జాపూర్‌ పీహెచ్‌సీలో 9, తిమ్మాపూర్‌లో 6, పుల్లూరులో 4, మిరుదొడ్డి రామక్కపేట, భూంపల్లి, రామవరం, మద్దూరులో మూడు చొప్పున కేసులు, మిగతా పీహెచ్‌సీలలో 26 కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు 5,614 మందికి జ్వరాలు, 508 మందికి జలుబు, 810 మందికి దగ్గు బారీన పడ్డారు.

జాగ్రత్తలు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement