‘చాంద్‌ సితారే’ మన గరిపెల్లి అశోక్‌ | - | Sakshi
Sakshi News home page

‘చాంద్‌ సితారే’ మన గరిపెల్లి అశోక్‌

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రానికి చెందిన బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్‌కు చాంద్‌ సితారే పురస్కారం స్వీకరించినట్లు అక్షర సేద్యం ఫౌండేషన్‌ అధ్యక్షుడు భైతి దుర్గయ్య, బాలసాహితీవేత్త ఉండ్రా ళ్ల రాజేశం తెలిపారు. బాల సాహిత్య రంగంలో చేస్తున్న విశేష సేవకు గాను ఖమ్మం జిల్లా కేంద్రంలో చాంద్‌ సితారే సంస్థ బాలసాహిత్య పురస్కారం ప్రదానం చేసిందన్నారు. అశోక్‌కు చాంద్‌ సితారే బాలసాహిత్య పురస్కారం రావడంపై పలువురు కవులు అభినందించారు.

చారిత్రక విశేషాలు తెలుసుకోవాలి

నంగునూరు(సిద్దిపేట): చారిత్రక విశేషాలను తెలుసుకొని వాటిపై అవగాహన పెంచుకోవాలని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్‌ విద్యార్థులకు సూచించారు. పాఠశాల యూత్‌ టూరిజం క్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నంగునూరులోని జోకీరమ్మ బండపై ఉన్న వర్ధమాన మహావీరుని విగ్రహం, నాటి చరిత్రపై శ్రీనివాస్‌ అవగాహన కల్పించారు. తోకల కొండపై వెలసిన సీతారాముల ఆలయాన్ని సందర్శించి సహజ సిద్ధంగా ఏర్పడ్డ బావి, ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో టూరిజం కోఆర్డినేటర్‌ రాంగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డిప్యుటేషన్లు ఆపండి

మద్దూరు(హుస్నాబాద్‌): దూల్మిట్టలోని ఉన్నత పాఠశాలలో గణితం, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను ఆపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉండటంతో టెన్త్‌ పరీక్షల్లో నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ విద్యాసంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపిస్తే పిల్లల చదువుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను ఆపాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement