తండ్రిని చంపిన తనయుడు | - | Sakshi
Sakshi News home page

తండ్రిని చంపిన తనయుడు

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

మహా అన్నదానం

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, అఖండ దీపపూజ, అగ్ని ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. మహా అన్నప్రసాదం చేశారు.

చిన్నకోడూరు(సిద్దిపేట): ఆస్తి విషయమై వేధింపులు భరించలేక తండ్రిని కడతేర్చాడు ఓ కుమారుడు. మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట రూరల్‌ సీఐ విద్యాసాగర్‌ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం .. మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌ గ్రామానికి చెందిన సయ్యద్‌ హైదర్‌ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సయ్యద్‌ హైదర్‌ తండ్రి సయ్యద్‌ కరీం కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి వచ్చి ఈ ఇల్లు నాది, నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపో అంటూ కొడుకుతో గొడవ పడుతున్నాడు. తండ్రి గొడవలకు విసిగిపోయిన కుమారుడు తండ్రిని అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలో ఈ నెల 5న మధ్యాహ్నం వేళ ఇంట్లో ఒంటరిగా పడుకున్న తండ్రి తలపై సుత్తెతో బలంగా కొట్టి పరారయ్యాడు. మరో కుమారుడు గమనించి సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 12న మృతి చెందాడు. ఈ విషయమై కొడుకు సయ్యద్‌ హైదర్‌పై హత్యా కేసు నమోదు చేశారు. నిందితుడు పరారిలో ఉన్నాడు. మంగళవారం సయ్యద్‌ హైదర్‌ గ్రామంలోని ఇంటికి వచ్చడాని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement