బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్
అక్కన్నపేట(హుస్నాబాద్): మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కన్నపేట మండలాన్ని పట్టించుకోవడంలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ మండిపడ్డారు. అక్కన్నపేటలో సోమవారం పార్టీ మండలాధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి నేతృత్యంలో మండల కార్యకర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించకపోవడం మంత్రి నిబద్దతకు నిదర్శనమన్నారు. మండలం ఏర్పాటై సుమారుగా తొమ్మిదేళ్లు దాటుతున్నా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో రైతులకు తీవ్రస్థాయి నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఖమ్మం వెంకటేశం, మాచర్ల కుమార్‌స్వామి, రజనీకర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.


