● డీఆర్‌ఓ నాగరాజమ్మ ● వచ్చిన అర్జీలు 139
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందించిన అర్జీలను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని డీఆర్‌ఓ నాగరాజమ్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 139 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ప్రత్యేక అదనపు కలెక్టర్ సుదర్శన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


