చేర్యాల(సిద్దిపేట): రాష్ట్రంలో పెడింగ్‌లో స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవులు, నాయకులు మహేందర్‌రెడ్డి, శశిదర్‌రెడ్డి, పాండు, సిద్ధారెడ్డి, సత్యవర్ధన్, చంద్రమౌళి, బాలరాజు, సందీప్, చంద్రశేఖర్‌చారి, రవి, లక్ష్మారెడ్డి, మనోజ్, ప్రవీణ్, రా ములు, మహేష్, రాజు, శ్రీకాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌యూఐ
జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా రాచకొండ ప్రశాంత్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


