సిద్దిపేటజోన్: సర్ ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యం నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి సమష్టిగా పనిచేయాలని సిద్దిపేట ఆర్డీఓ సదానందం సూచించా రు. బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో సర్ నోటీసుల జారీ ప్రక్రియ. డిక్లరేషన్ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నోటీసులు పంపిణీ పూర్తి చేయాలని. అర్హులైన ఒక్క ఓటు పోకుండా చూడాలని సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లకు ఆయా పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించి సకాలంలో ప్రక్రియ జరిగేలా చూడాలని సూచించారు. మోహన్‌లాల్, మునీర్ పాల్గొన్నారు.


