సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్ ఈనెల 12న నిర్వహిస్తుండటంతో కక్షిదారులు నేరుగా న్యాయస్థానాన్ని సంప్రదించి రాజీ చేసుకోవచ్చని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ పడదగిన సివిల్, ఆస్తి కుటుంబ తగాదాలు, కుటుంబ పరమైన నిర్వహణ, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంకెన్ డ్రైవ్, చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు రాజీ చేసు కోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందన్నారు.
సీపీకి విత్తన గణపతి అందజేత
గజ్వేల్: ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా బుధవారం సిద్దిపేట సీపీ రష్మీపెరుమాళ్‌కు ఆ సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వర్‌రావు విత్తన గణపతిని అందజేశారు. విత్తన గణపతిని పూజించి, నేలలో నాటితే, దేవుడు మొక్కగా మారి ఆశీర్వదిస్తారని రాజేశ్వరరావు చెప్పారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మార్గదర్శనంలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్ మొగిలి తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లి రైల్వేస్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాం
రూ. 40 కోట్లతో నిర్మాణం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్‌లో రూ. 40 కోట్లతో అదనపు ప్లాట్ ఫాం నిర్మించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధి కారి పద్మజ వెల్లడించారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు, అఽధికారులు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో రెండు రైళ్లను పెంచాలని వినతిపత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు చేపడుతున్న రైల్వే లైన్ పనులు పూర్తయితే టెంపుల్ కారిడార్ ఏర్పాటు అవుతుందన్నారు. 24 గంటలూ భక్తులకు రైల్వే సిబ్బంది స్టేషన్‌లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు.
మల్బరీ సాగుతో సిరులు
రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ జేడీ లత
తొగుట(దుబ్బాక): మల్బరీ సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండుతుందని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. మండలంలోని పెద్దమాసాన్‌పల్లి రైతు వేదికలో ‘నాపట్టు.. నా అభిమానం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడారు. పట్టుగూళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. మల్బరీ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎల్‌ని నో ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి లేనందన రైతులు సాగుకు ముందురావాలన్నారు. మిగితా పంటల మాదిరిగా పంట పెట్టుబడి ఖర్చులు అంతగా ఉండవన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసే దిశగా రైతులు ఆలోచించాలని ఆమె కోరారు. అనంతరం శాస్త్రవేత్తలు మల్లికార్జున్, రాఘవేంద్ర మల్బరీ సాగుపై రైతులకు ఆవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ తిరుపతిరెడ్డి, జిల్లా అధికారి సామల ఐలయ్య, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు.
తొలి రోజు
యూజీసీ నెట్ ప్రశాంతం
సిద్దిపేటఅర్బన్: ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్) పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షకు తొలి రోజు ఉదయం సెషన్‌కు 47 మందికి గాను 27 మంది హాజరయ్యారు. 20 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో సెషన్‌కు 37 మందికి గాను 32 మంది హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ శ్రీకాంత్, టీసీఎస్ ఆఫీసర్ మహేష్‌బాబు పర్యవేక్షించారు.


