క్రీడాకారులు ఖేలో ఇండియా, రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ పోటీలు వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్నాయి. దీంతో క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. కోమటి చెరువు, రంగనాయక సాగర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌ను అందుబాటులోకి తీసుకువస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతుంది.
– గుండె ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి,
జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్
పరిశీలించి చర్యలు తీసుకుంటా
సిద్దిపేటలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను త్వరలో పరిశీలించి చర్యలు తీసుకుంటా. కలెక్టర్ అనుమతితో మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేస్తా.
– మల్లికార్జున్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్


