మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూర్‌కు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. బుధవారం ఉపసర్పంచ్ బెడద శివకుమార్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ నిత్యం ఎంతోమంది విద్యార్థులు చదువుకునేందుకు జనగామ జిల్లా కేంద్రానికి వెళ్తుంటారని, బస్సు లేకపోవడం వల్ల విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ఆర్టీసి అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్‌చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, జీడికంటి సురేష్, రామడుగు బాలరాజు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


