దుబ్బాక టాప్‌ ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

దుబ్బాక టాప్‌ ‘సర్‌’

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

మున్సిపాల్టిలలో సైతం

దుబ్బాకదే మొదటి స్థానం

జిల్లాలో 76.71 శాతం

డిజిటలైజేషన్‌ పూర్తి

దుబ్బాక: సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్‌) ప్రక్రియలో దుబ్బాక నియోజకవర్గం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌లో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే దుబ్బాక నియోజకవర్గం చాలా ముందంజలో ఉంది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 2,04,664 ఓటర్లకు గాను 1,69,202 మంది ఓటర్ల ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటలైజ్‌ చేశారు. కేవలం 35,462 మంది 17.33% మాత్రమే మిగిలి ఉంది. దీంతో 82.67% పనులు పూర్తి చేసుకుని జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. మిగతా వరుసలో హుస్నాబాద్‌ నియోజకవర్గం 79.32%తో 2 వ స్థానంలో నిలవగా మొత్తం 2,54,543 మంది ఓటర్లకు గాను 2,01,911 డిజిటలైజ్‌ కాగా ఇంకా 52,632 మంది 20.68% కావాల్సి ఉంది. గజ్వేల్‌ నియోజకవర్గం 2,89,253 మంది ఓటర్లకు గాను 2,13,920 మంది ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజ్‌ పూర్తి కావడంతో 73.96%తో 3వ స్థానంలో ఉంది. ఇంకా 75,333 మంది 26.04% కావాల్సి ఉంది. సిద్దిపేట నియోజకవర్గం కేవలం 72.28%తో జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,44,507మందికి గాను 1,76,721 కాగా ఇంకా 67,786 మంది 27.72% మిగిలిపోయింది. జిల్లాలో మొత్తం 9,92,967 ఓటర్లకు గాను 7,61,754 మంది ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయి సగటున 76.71 % ఉండగా ఇంకా 2,31,213 ఓటర్లు 23.29% కావాల్సి ఉంది.

మున్సిపాలిటీల్లో టాప్‌ దుబ్బాకనే..

సర్‌ ప్రక్రియ లో జిల్లాలోని మున్సిపాలిటీల్లో సైతం దుబ్బాకనే అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సర్‌ ప్రక్రియ గడువు ఆగష్టు 3 వరకు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

82.67శాతం ఎన్యూమరేషన్‌తో జిల్లాలో అగ్రస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement