హరీశ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలంలోని మాత్‌పల్లిలోని కాంగ్రెస్ నాయకులు కనకారెడ్డి, బ్యాగరి శ్రీనివాస్, సిలివేరు సుధాకర్, జంగిటి సుధాకర్ తదితరులు ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఆరు గ్యారంటీలంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం కోసం ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని, మూడేళ్ల అధికారంలో ఉన్నా ఆ పార్టీ పనితీరు నచ్చక కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీకి చెంప పెట్టులాంటిదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ బచ్చలి మహిపాల్, నాయకులు కృష్ణాగౌడ్, బాలయ్య, సాయిలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


