దళితులను వేధిస్తే సహించం
దుబ్బాకటౌన్: దళితులను వేధిస్తే సహింబోమని, రాయపోల్ మండలం అనాజిపూర్ దళితుల పై మూకుమ్మడిగా దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని పొలీసులను, రెవెన్యూ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య ఆదేశించారు. రాయపొల్ మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన యాదగిరి కుటుంబంపై ఇటీవల దాడి జరిగిందని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బక్కి వెంకటయ్యకు వినతి పత్రం అందించారు. దీంతో ఆయన పొలీస్ అధిఅకారులకు, రెవెన్యూ అధికారులకు పోన్‌చేసి నిందితుల అరెస్టులో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి


