యూరియా కోసం ఆందోళన వద్దు
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అల్వాల రైతు వేదికలో నిర్వహిస్తున్న యూరియా కార్డుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా యూరియా కొరత రాకుండా పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టా పాసు బక్కులను తీసుకువచ్చి యూరియా కార్డులను తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒక ఎకరానికి 2 బస్తాల చొప్పున, యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు. కౌలు రైతులు సైతం అసలు పట్టాదారు పాస్ బుక్కు లేదా జీరాక్స్‌ను తీసుకువస్తే యూరియా అందజేస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న యూరియా కొరత కథనాలను రైతులు నమ్మెద్దన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి మల్లేశం, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పీహెచ్‌సీ కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య విధానాలపై ఆరా తీశారు. కాలం చెల్లిన మందులను వాడరాదని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులను నెలవారిగా మానిటరింగ్ చేసి ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాకు సరిపడా నిల్వలు
కలెక్టర్ హైమావతి


