సుబ్రహ్మణ్యేశ్వరునికి లక్ష పుష్పార్చన
వైభవంగా కృత్తిక మహోత్సవం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో కృత్తిక మహోత్సవ వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో అర్చకులు స్వామివారికి విశేష పంచామృతాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలమాలికలతో అలంకరించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరుని నామాలు పఠిస్తూ లక్షపుష్పార్చన చేశారు. ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.


