ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం

Apr 26 2025 8:00 AM | Updated on Apr 26 2025 8:00 AM

ఉద్యమ

ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం


నిబంధనల మేరకే భూసేకరణ

ట్రిపుల్‌ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగుతోంది. ఎన్‌హెచ్‌ 1956 చట్టం ప్రకారం ఈ భూసేకరణ జరుగుతుంది. పరిహారం పంపిణీ కూడా మే లేదా జూన్‌ నెలలో పూర్తి కానుంది. దీని తర్వాత భూముల స్వాధీనానికి చర్యలుంటాయి.

– తోసిఫ్‌, డిప్యూటీ మేనేజర్‌, ఎన్‌హెచ్‌ఏఐ

పాదయాత్ర విజయయాత్ర కావడం ఖాయం

గెలిచినా ఓడినా ప్రజల పక్షమే

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడి 25 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం, యువజన విభాగాల ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూంపం వద్ద అమరవీరులకు, పహల్గామ్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. అనంతరం వరంగల్‌కు పాదయాత్రను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి మిట్టపల్లి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ విద్యార్థి, యువజన విభాగాలు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర.. పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్ర కాబోతుందన్నారు. చాలా పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యాన్ని సాధించిందన్నారు. కేసీఆర్‌ అనే ఒక గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఏ పాత్ర అయినా బీఆర్‌ఎస్‌ తెలంగాణ పక్షం వైపే ఉండి పోరాడుతుందన్నారు. 44 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా 1500 మంది యువత పాదయాత్రగా రజతోత్సవ సభకు బయలుదేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌.. గాంధీ చూపిన బాటలో ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో, అభివృద్ధి సంక్షేమాల్లో, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలు ఇచ్చింది, కాంగ్రెస్‌ చెప్పిన మోసపూరిత మాటలు, అబద్దపు హామీలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. పాదయాత్ర పొడుగునా కాంగ్రెస్‌ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని, రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకుంటానన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

యువకులకు దిశా నిర్దేశం చేస్తున్న హరీష్‌రావు

నంగునూరు(సిద్దిపేట): బీఆర్‌ఎస్‌ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మధ్యాహ్నం పాలమాకులకు చేరుకుంది. భోజనాల అనంతరం ఎమ్మెల్యే హరీష్‌రావు యవకులకు దిశానిర్దేశం చేశారు. ‘నేను మీతో కలసి పాదయాత్ర చేస్తా.. మిమ్ములను గుండెలో పెట్టుకొంటా’ అని అన్నారు. యువకులు క్రమశిక్షణతో వరంగల్‌ వరకు పాదయాత్ర చేయాలన్నారు. ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సాయంత్రం తిరిగి పాదయాత్ర ప్రారంభించిన యువకులు రాత్రి బద్దిపడగలో బస చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం

నంగునూరు(సిద్దిపేట): వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో ధాన్యం దళారుల పాలు అవుతోందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. పాలమాకులలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వడ్లు అమ్మి వారం రోజులు గడుస్తున్నా డబ్బులు రాలేదని రైతులు తెలిపారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని అన్నారు. గత యేడాది లక్షా 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పి కేవలం 52 వేల మెట్రిక్‌ టన్నులే సేకరించిందన్నారు.

ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం1
1/2

ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం

ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం2
2/2

ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement