
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు
గాలివాన బీభత్సం
గజ్వేల్‌రూరల్: గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైన సీతారామ ఉమామహేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అగ్ని గుండాలు, గరుడ వాహనసేవ నిర్వహించారు. అలాగే గరుడ వాహనంపై స్వామివార్ల విగ్రహాలను ఉంచి పట్టణంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
● బెజ్జంకిలో పిడుగుపడి వృద్ధురాలు మృతి
● కూలిన విద్యుత్ స్తంభాలు
● నేలరాలిన మామిడికాయలు
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలో గురువారం ఈదురు గాలులతో కురిసిన వాన బీభత్సం సృష్టించింది. లక్ష్మీపూర్‌లో విద్యుత్ స్తంభాలు కూలాయి. మామిడితోటల్లో మామిడికాయలు నేలరాలాయి. బెజ్జంకిలోని ఎడ్ల బొమ్మ సమీపంలో పిడుగు పడి టేకు రంగవ్వ (63) అనే వృద్ధురాలు మృతిచెందగా టేకు ప్రవీణ్ అనే 13 ఏళ్ల బాలుడు స్పృహతప్పిపడిపోయాడు. వీరిని మొదట బెజ్జంకి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రంగవ్వను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రవీణ్‌ను అంబులెన్సులో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు

భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు