
ఫౌండేషన్ సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలో బీఆర్‌ఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆది వారం ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మండలంలోని పేద ప్రజలు, విద్యార్థులకు ఆర్థిక సాయం అందిండటం, అలాగే క్రీడాకారులకు ప్రో త్సాహకాలు అందించడం సంతోషంగా ఉంద న్నారు. అదే విధంగా మండలంలో ఎవరైనా నిరుపేదలు మరణిస్తే వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం అందించడం గొప్పవిషయమని కొనియాడారు. భవిష్యత్‌లో ఫౌండేషన్ సేవలు మరింత ఎక్కువ మంది కి అందేలా చూడలని సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కిషన్, మాజీ జెడ్పీటీసీ సిద్దప్ప, శ్రీధర్, నర్సింహులు, స్వామి, వంశీధర్‌రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.