ఇక ఈజీ..! | - | Sakshi
Sakshi News home page

ఇక ఈజీ..!

Mar 16 2025 7:43 AM | Updated on Mar 16 2025 7:42 AM

ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
ఈవీ చార్జింగ్‌..

టైం వేస్ట్‌ కావడం లేదు

కారు చార్జింగ్‌ కోసం ఇది వరకు ప్రత్యేకంగా టైం కేటాయించే వాళ్లం. ఇప్పుడు హోటళ్లలో ఈ– ఛార్జింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తుండటంతో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ టైం ఏది అయితే ఆ సమయంలో ఒక గంట సమయం ఛార్జింగ్‌ పెడుతున్నాం. ఇలా అన్ని హోటళ్లలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

– ముక్తా శ్రీనివాస్‌, మంచిర్యాల

రోజుకు 10 కార్లు చార్జింగ్‌

రెండు నెలల క్రితం మా హోటల్‌లో రెండు కంపెనీలకు చెందిన వారు ఈవీ– ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కారు ఛార్జింగ్‌ అయ్యే సమయంలో కస్టమర్లు భోజనం, టిఫిన్‌, స్నాక్స్‌, టీ తాగుతున్నారు. ఇలా రోజుకు 10 కంటే ఎక్కువగానే వాహనాలు ఛార్జింగ్‌ చేసుకుంటున్నారు. కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉంది. గతంలో ఈ– ఛార్జింగ్‌ స్టేషన్‌ ఎక్కడ ఉందని కస్టమర్లు అడిగే వారు. ఇప్పుడు వారి ఇబ్బందులు తప్పాయి.

– కేఆర్‌శర్మ, జీఎం, హరిత మినర్వా, సిద్దిపేట

సాక్షి, సిద్దిపేట: హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌లో ఈ–చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పినట్లు అయింది. దీంతో సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ అయితే సామర్థ్యాన్ని బట్టి నిమిషాల్లో ట్యాంక్‌ ఫుల్‌ అవుతుంది. అదే ఎలక్ట్రిక్‌ కారు అయితే 45 నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఛార్జింగ్‌ అవసరమవుతోంది. ఎక్కువగా ఎంజీ, టాటా, హ్యుందాయ్‌, కియా, బీవైడీ కార్లను వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో రూ.8 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు (బెంజ్‌ లాంటి కంపెనీలు కాకుండా) కార్ల ధరలు ఉన్నాయి. కార్లను బట్టి 45 నిమిషాల నుంచి 8 గంటల పాటు చార్జింగ్‌ చేసే 50 కిలో మీటర్ల నుంచి సుమారుగా 350 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం అంతా ఈవీలపైనే ప్రజలు మక్కువ చూపుతున్నారు. గతంలో ఎలక్ట్రిక్‌ కారు యజమానులు ముందుగానే బ్యాటరీ చార్జింగ్‌ చేయించుకునేవారు. కొంత లిమిట్‌ వరకే వెళ్లేవారు.. మళ్లీ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఎక్కడ ఉందని వెతుక్కొని చార్జింగ్‌ పెట్టుకునేవారు. దూర ప్రయాణం చేయాల్సి వస్తే కొంత ఇబ్బంది పడాల్సి వచ్చేది. దీంతో పలు కంపెనీలు ఈ–చార్జింగ్‌ స్టేషన్లను హోటల్‌, షాపింగ్‌ మాల్స్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాహనదారులకు టెన్షన్‌ పోయింది.

ప్రత్యేక యాప్‌లో వివరాలు..

పలు కంపెనీలను ఈ–చార్జింగ్‌ స్టేషన్లకు సంబంధించి ప్రత్యేక యాప్‌లను అందుబాటులోకి తెచ్చారు. యాప్‌ ద్వారా సమీప హోటల్‌, షాపింగ్‌ మాల్స్‌లలో ఎక్కడ ఈ–చార్జింగ్‌ స్టేషన్‌ అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. యాప్‌ ద్వారానే స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. దీని ద్వారానే డబ్బులు సైతం చెల్లించవచ్చు. దీంతో ప్రయాణం చేసే సమయంలో వాహనాల యజమానులు హోటళ్లలో ఈ –కారు చార్జింగ్‌ చేసుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ఒక వైపు కారులో ప్రయాణించే వారు భోజనం, స్నాక్స్‌ తీనే సమయంలోనే కారు చార్జింగ్‌ అవుతుంది. యూనిట్లను బట్టి ఆయా కంపెనీలు ఛార్జింగ్‌కు డబ్బులు వసూలు చేస్తున్నాయి.

న్యూస్‌రీల్‌

హోటళ్లు, రెస్టారెంట్లలో

స్టేషన్ల ఏర్పాటు

టిఫిన్‌, భోజనం చేసి వచ్చేసరికి పూర్తి

వాహనదారుల సమయంవృథా కాకుండా ఏర్పాటు

సంవత్సరం రిజిస్ట్రేషన్‌ అయిన అన్ని రకాల వాహనాలు 2020–2021 8,79,826

2021–2022 9,51,780

2023–2024 9,76,073

ఇక ఈజీ..!1
1/5

ఇక ఈజీ..!

ఇక ఈజీ..!2
2/5

ఇక ఈజీ..!

ఇక ఈజీ..!3
3/5

ఇక ఈజీ..!

ఇక ఈజీ..!4
4/5

ఇక ఈజీ..!

ఇక ఈజీ..!5
5/5

ఇక ఈజీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement