శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
సిద్దిపేటజోన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, వారికి మరింత భరోసా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని పీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ తెలిపారు. సీఎంను నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చేనేత పరిశ్రమకు కొత్త సంక్షేమ పథకాలను అమలు చేసి కార్మికులను ఆదుకుంటామని, అన్ని సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని సీఎం చెప్పారన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు అర్హులైన చేనేత కార్మికులకు అందేలా పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.
న్యూస్‌రీల్
చేనేతలకు మరింత భరోసా