పిల్లలు ప్రయోజకులైతేనే సంతృప్తి
సిద్దిపేటరూరల్: విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. శనివారం సావిత్రి బాయి పూలే 195 జయంతి, మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్వకాలం గురువులు ఏమి ఆశించకుండా విద్యను బోధించేవారన్నారు. బోధించే ప్రతి వాక్యం విద్యార్థిని ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. చదివే పిల్లలు గొప్పవారైతే ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. సావిత్రి బాయిని ఆదర్శంగా తీసుకొని మహిళలు ఉన్నత విద్యావంతులు కావాలని చెప్పారు. అనంతరం పలువురు ఉత్తమ సేవలు అందించిన మహిళా ఏంఈఓలు, ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు.
ప్రతి ఆదివారం వైద్యశిబిరం ఏర్పాటు చేయాలి
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రతి ఆదివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. మందులు, పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సదుపాయాలకై నా డీఎం అండ్ హచ్‌ఓ దృష్టికి తీసుకురావాలని, రోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని వైద్యాధికారి హరితను ఆదేశించారు. శిక్షణ కోసం వచ్చిన సర్సింగ్ కళాశాల విద్యార్థులతో మాట్లాడుతూ పుస్తకాలలో చదివిన జ్ఞానాన్ని నేరుగా చూస్తూ మంచి శిక్షణ పొందాలని, ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని కోరారు.
కలెక్టర్ హైమావతి
ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు


