మెరుగైన పాలన అందించండి
గజ్వేల్: గ్రామాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కొత్త సర్పంచ్‌లపై ఉందని ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జగదేవ్‌పూర్ మండలం తీగుల్ సర్పంచ్ రజితతోపాటు పాలకవర్గం బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా రజితను హరీశ్‌రావు అభినందించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సర్పంచ్‌తోపాటు పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, సహకార సంఘం మాజీ డైరెక్టర్ భూమయ్య, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు
తీగుల్ సర్పంచ్, పాలకవర్గానికి
అభినందనలు


