ఒగ్గుడోలు శిక్షణలో విద్యార్థులు అద్భుతంగా రాణించారు. చండీశ్వర ఒగ్గు కళాసేవా సమితి మాణిక్యపురం ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఒగ్గుడోలు శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. పది రోజులు పాటు శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఒగ్గుడోలు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మయ్య పాల్గొని మాట్లాడారు. మొదటి సారిగా కళాశాల స్థాయిలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు ఒగ్గుడోలు నేర్పించడం గొప్ప పరిణామమని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కళారూపాల్లో విద్యార్థులు ప్రావీణ్యం పెంపొందించుకోవాలని అన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
– సిద్దిపేట ఎడ్యుకేషన్