గజ్వేల్‌రూరల్: అనుమతులు లేకుండా ఇసుక రవాణాచేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనుమతులు, వే బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 5లారీలను సోమవారం రాజీవ్ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పట్టుకున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్ రవాణా చేసినా, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, కలిగిఉన్నా చర్యలు తప్పవన్నారు. సమాచారం ఉంటే 8712667445, 87126 67446, 8712667447 నెంబర్లకు తెలియజేయాలని ప్రజలను కోరారు.