
మాట్లాడుతున్న తూంకుంట నర్సారెడ్డి
● వాసవీక్లబ్ సేవలు అభినందనీయం ● డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్: మహిళలు తమ శక్తి, సామర్థ్యాలను చాటాలని డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ వాసవిక్లబ్, మహిళా విభాగం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా, వ్యాపా ర రంగాలతో పాటు సామాజిక సేవలో ఆర్యవైశ్య మహిళలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యుల కార్యక్రమాలకు తన సహకా రం ఎల్లప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా వాసవీక్లబ్ అధ్యక్షుడిగా జగ్గయ్యగారి శేఖర్‌గుప్త, మహిళా విభాగం అధ్యక్షురాలిగా శారదలు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్‌గుప్త, జిల్లా అధ్యక్షుడు కాసం నవీన్‌గుప్త, గవర్నర్ డాక్టర్ సుధారాణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత, రాష్ట్ర కార్యదర్శి నాగరాణి తదితరులు పాల్గొన్నారు.