ములుగు(గజ్వేల్): సీఎం కేసీఆర్‌కే మా మద్దతు అంటూ కొండపోచమ్మసాగర్ భూ నిర్వాసిత గ్రామమైన మామిడ్యాల ఆర్‌అండ్‌ఆర్ కాలనీకీ చెందిన వివిధ కుల సంఘాల నాయకులు ఏక గ్రీవంగా తీర్మానించారు. సోమవారం మామిడ్యాల ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాలు బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. సంబంధించిన తీర్మాన పత్రాలను పార్టీ మండల ఇన్‌చార్జి రవీందర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ జహంగీర్, ఉమ్మడి మెదక్‌జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డిలకు అందజేశారు. అనంతరం ఈ తీర్మాన పత్రాలను ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌కు జహంగీర్ అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జయమ్మఅర్జున్‌గౌడ్, జెడ్పీ కోప్షన్ సభ్యుడు సలీం, ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్, ఎంపీటీసీ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి, గణేశ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి జూబేర్‌పాష, నాయకులు పాల్గొన్నారు.