రైతులకు అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

రైతులకు అవగాహన కల్పించండి

Nov 28 2026 10:29 AM | Updated on Nov 28 2026 10:29 AM

నారాయణఖేడ్‌: ఎల్‌నినో ప్రభావం, భూగర్భజలాలు అడుగంటిన నేపథ్యంలో యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులు వరి సాగు చేసి నష్టపోకుండా అవగాహన కల్పించాలని డీఏఓ శివప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖేడ్‌ ఏడీఏ కార్యాలయంలో డివిజన్‌ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూగర్భ జలమట్టం సాధారణ స్థాయికంటే 19 మీటర్ల లోతుకు చేరుకోవడం ఆందోళన కరమన్నారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఆరుతడికి నీటి లభ్యత ఆధారంగా శనగ, తెల్ల కుసుమ, చిరు ధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ, ఉద్యాన పంటలు సాగు చేసుకునేలా ప్రొత్సహించాలన్నారు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు, గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చే స్తూ వంద శాతం పూర్తి చేయాలన్నారు. అనంతరం పలు గ్రామాల్లో జరిగిన పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమావేశంలో ఏడీఏ ప్రవీణ్‌ చారి, ఏఓ ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

డీఏఓ శివప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement