నారాయణఖేడ్: రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్చార్జీ బీఎం సందీప్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గిరిజా షెట్కార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సందీప్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.


