ఎన్నాళ్లీ నీటి వృథా! | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ నీటి వృథా!

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

నారింజ ప్రాజెక్టు నీటిని ఒడిసిపట్టేందుకు చెక్‌డ్యాంలు ఏవీ?

రూ.24.26 కోట్లతో ప్రతిపాదనలు నిధుల మంజూరు కోసం ఎదురు చూపులు

జహీరాబాద్‌ మండలంలోని కొత్తూర్‌(బి) గ్రామం వద్ద 1969లో నారింజ ప్రాజెక్టును 600 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 15 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాజెక్టులో సుమారు ఒక క్యూసెక్కుల నీరు నిలువ ఉంటుంది. సుమారు వేయి ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రాజెక్టును కట్టినప్పటికీ కుడి, ఎడమ కాలువల నిర్మాణం లోపం వల్ల ఇప్పటివరకు ఎకరం పొలానికి కూడా నీరందలేదు. దీంతో ప్రాజెక్టు ఊట చెరువుగా మార్చేశారు. ఫలితంగా పలు గ్రామాల పరిధిలో భూగర్భ జాలాలు పెరిగాయి. అయితే శాశ్వత నీటి వనరులు లేనందున నారింజ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని రైతులు, ఉద్యమకారులు, తదితరులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించినా ప్రభుత్వాలు మారినా నారింజ ప్రాజెక్టు గురించి పట్టించుకొనే వారు కరువయ్యారు.

చెక్‌ డ్యాంలు నిర్మాణానికి ప్రతిపాదనలు

నారింజ ప్రాజెక్టులో సుమారు ఒక క్యూసెక్కుల నీరు మాత్రమే నిలువ ఉంటుంది. భారీ వానలకు ప్రాజెక్టు నిండిపోతుంది. వర్షాకాలంలో భారీ వానలు పడితే గేట్లు ఎత్తివేసి ఆ నీరంతా వృథాగా కర్ణాటకకు వదిలేస్తుంటారు. ప్రతీ ఏటా రెండు మూడు టీఎంసీల నీరు కర్ణాటక పాలవుతుంది. నీరు కర్ణాటకకు తరలిపోకుండా ఉండేందుకు ప్రాజెక్టు కింద వాగుపై పలు ప్రాంతాల్లో చెక్‌డ్యాంలను నిర్మించాలని నిర్ణయించారు. మండలంలోని నారింజ వాగుపై బుర్దిపాడ్‌, బూచినెల్లి, సత్వార్‌, చిరాగ్‌పల్లి గ్రామాల శివారులో చెక్‌డ్యాంలను నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. మేరకు రూ.24.26 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలకు ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉంది. ప్రజా ప్రతినిధుల, అధికారులు స్పందించి నిధుల మంజూరుకు కృషి చేయించి చెక్‌డ్యాంలను కట్టించాలని రైతులు కోరుతున్నారు.

నారింజ ప్రాజెక్టు నుంచి ఏటా వృథాగా కర్ణాటక వైపు వెళ్తున్న నీటిని ఒడిసిపట్టేందుకు రూపొందించిన చెడ్‌డ్యాంల ప్రతిపాదనలు నిధుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నాయి. రూ.24.26 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. దీంతో ప్రతీ ఏటా భారీ వర్షాలు కురిసినప్పుడు నారింజ ప్రాజెక్టు నిండిపోయి ఆ నీరంతా వృథాగా కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతుంది.

జహీరాబాద్‌ టౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement