కొనుగోలు కేంద్రానికి 200 క్వింటల ధాన్యం తెచ్చి పదిరోజులైంది. ఇప్పటివరకు తూకం వేయలేదు. వారానికి ఒకటి రెండు లారీలు మాత్రమే ధాన్యం తీసుకెళ్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి.
–ఆరట్ల రాజు, పన్యాల గ్రామ రైతు.
లారీలు ఖాళీ కావడం లేదు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యంతో వెళ్లిన లారీలు గోదాముల వద్ద త్వరగా ఖాళీ కావడం లేదు. దీంతో వారానికి రెండు లారీలు మాత్రమే కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
–రాజశేఖర్, ఏపీఎం


