నారాయణఖేడ్: రాష్ట్ర రవాణశాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన అధికారిక నివాసంలో ఎమ్మెల్యే డా.సంజీవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణాపరమైన ఇబ్బందులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన బస్సు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాలను మంత్రికి వివరించారు. ఖేడ్ డిపోకు 20 కొత్త బస్సులను కేటాయించాలని, నియోజకవర్గంలోని ఖేడ్, పెద్దశంకరంపేట బస్టాండ్‌లను ఆధునీకరణకు రూ.30 లక్షలు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆయా వాటికోసం మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఆయనవెంట ఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారంశంకర్ ఉన్నారు.


