దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు ఐసా రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సతీశ్‌ మంజీరాలోకి రంగు మారిన నీటి ప్రవాహం విద్యాధరి సేవలో ఇందిరా చతుర్వేది

మాజీ మంత్రి చంద్రశేఖర్‌

జహీరాబాద్‌: రాష్ట్రంలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ అన్నారు. జహీరాబాద్‌లోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కరపత్రాలను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కుటుంబ జీవిత బీమా పథకం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకం వల్ల కుటుంబ పెద్దకు అనుకోకుండా జరగరానిదేదైనా జరిగితే ఆ కుటుంబ రోడ్డున పడకుండా ఆర్థిక భరోసా లభిస్తుందని వివరించారు. అనంతరం రంజోల్‌ గ్రామంలో ఇంటింటికీ తిరిగి బీమా పథకం కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ యూనూస్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ పి.రామలింగారెడ్డి, ఆయా మండలాల, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ఐసా (ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌) తెలంగాణ రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీగా సంగారెడ్డి జిల్లా ఐసా కార్యదర్శి కిందిదొడ్డి సతీశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌, జిల్లా ఉపాధ్యక్షురాలు వాణి రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఐసా తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలకు ఐసా జాతీయ కార్యదర్శి ప్రెజెంజిత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కొల్చారం(నర్సాపూర్‌): మండలంలోని మంజీరా నదిలో సోమవారం నుంచి నీరు ఆకుపచ్చని రంగులో ప్రవహిస్తోంది. ఈ నీటితో అక్కడక్కడ మడుగులు సైతం నిండాయి. మొన్నటివరకు ఎడారిగా ఉన్న మంజీరాలోకి ఈ రకమైన నీటి ప్రవాహం వస్తుండటంతో రైతులతో పాటు సమీప పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినోతో వర్షాలు లేకపోవడం, ఎగువ సింగూర్‌ నుంచి నీటి ప్రవాహం లేకపోవడం అసలు నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది తెలియరావడం లేదు. ఎగువ మంజీరా పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల నుంచి రసాయనాలతో కూడిన కలుషిత నీరు విడుదల చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నదిలోకి ప్రవేశిస్తున్న నీరు, ఎంతవరకు సురక్షితం అన్నది ఆందోళనకు గురిచేస్తోంది.

వర్గల్‌(గజ్వేల్‌): కార్తీకపౌర్ణమి వేళ మంగళవారం వర్గల్‌ విద్యాసరస్వతి క్షేత్రాన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌ డైరెక్టర్‌ ఇందిరా చతుర్వేది వైద్య సందర్శించారు. ఆలయ పరివారం ఆమెకు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని అర్చన జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మహదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రంతో సన్మానం చేశారు. క్షేత్రం బాగుందని అన్నారు. ఆమె వెంట మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement