కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

హత్నూర(సంగారెడ్డి): కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించి 20 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం కుప్పలను పెట్టుకుని కొనుగోళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. ధాన్యం తీసుకెళ్లిన లారీలు గోదాముల వద్ద ఖాళీ అవ్వక వారానికి రెండు మాత్రమే వస్తున్నాయి. దీంతో ధాన్యం తెచ్చిన రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. హత్నూర మండలంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు 21, హత్నూర సొసైటీ 16, కాసాల సొసైటీ ఆధ్వర్యంలో మూడు కొనుగోలు కేంద్రాలు అధికారులు ఆర్భాటంగా స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఎమ్మెల్యే సునీతారెడ్డి సైతం ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పటికీ సొసైటీలలో 69 లారీలు మాత్రమే ధాన్యం లారీలు గోదాంకు తీసుకెళ్లాయి. ఇంకా 170 లారీల ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ఉన్నాయి. వారానికి రెండు లారీలు ధాన్యం బస్తాలు లోడింగ్‌ చేస్తే కూలి డబ్బులు సరిపోవటం లేదని ఇతర రాష్ట్రాల హమాలీలు కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

20 రోజులైనా అంతంతమాత్రంగానే కొనుగోళ్లు

వారానికి రెండు లారీలే దిక్కు

గోదాముల వద్ద ఖాళీ కానీ ధాన్యం లారీలు

ఇబ్బందుల్లో రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement