పటాన్‌చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన మున్నూరు శైలేందర్ (68), మున్నూరు రాజారాంతో కలిసి గురువారం మధ్యాహ్నం స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద వేగంగా వచ్చిన టిప్పర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శైలేందర్‌ను మదీనగూడలోని శ్రీకర ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్కూటీపై వెనుక కూర్చున్న రాజారాం కుడికాలికి గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
కారు ఢీకొని బాలుడు..
తూప్రాన్: మనోహరాబాద్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఈ ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం ప్రకారం.. మెహరీన్, సజావుద్దీన్ దంపతుల కుమారుడు జోహాన్(4) గురువారం సాయత్రం కిరాణా దుకాణానికి వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మరొకరికి గాయాలు


