జహీరాబాద్ టౌన్: విద్యార్థులు చదువుతో పాటు సాధారణ చట్టాలపై కనీస అవగాహన పెంచుకోవాలని జహీరాబాద్ జూనియర్ సివిల్ జడ్జి ఎండీ.అబ్దుల్ ఖలీల్ పేర్కొన్నారు. గురువారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మైనార్టీ బాలుర వసతి గృహంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలగాలన్నారు. ఉపాధ్యాయులు దిశానిర్ధేశకులని, వారిని గౌరవించాలన్నారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు చట్టాలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గోపాల్, ఇస్మాయిలప్ప, సందీప్‌కుమార్, విజయ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
జూనియర్ జడ్జి ఎండీ అబ్దుల్ ఖలీల్


