ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగు చేయాలి

Nov 20 2026 7:39 AM | Updated on Nov 20 2026 7:39 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): ఎల్‌నినో తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి దేవ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలో నిర్వహించిన ఎల్‌నినో గ్రామసభలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితితో సాగునీరు, విద్యుత్‌ సరాఫరాలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రైతులు వరికి బదులుగా తక్కువనీటితో ఎక్కువ విస్తీర్ణం సాగయ్యే పొద్దుతిరుగుడు, కుసుమ, జొన్న, శెనగ, వేరుశెనగ, పెసర, మినుము, ఆయిల్‌ఫామ్‌ పంటలను సాగు చేయాలని కోరారు. కూరగాయలు సాగు చేసి అధిక లాభాలను పొందవచ్చన్నారు. రైతులు పంటపొలాల వద్ద ఫామ్‌పాండ్‌ తవ్వుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లేశం, మండల ప్రత్యేక అధికారి సింధు, హార్టికల్చర్‌ జిల్లా అధికారి మహేశ్వరి, ఎంపీడీఓ దామోదర్‌, ఏఓ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

వ్యవసాయశాఖ జిల్లా అధికారి దేవ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement