చేగుంట(తూప్రాన్): విద్యుత్ షాక్‌తో పాడిగేదె మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. ఇబ్రహీంపూర్ గ్రామంలో బుధవారం రాత్రి రైతు ఎల్లగొల్ల భాను పశువులను పొలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం పశువుల పాకవద్దకు వెళ్లి చూడగా గేదైపె విద్యుత్ వైరు తెగిపడి షాక్‌తో మృతి చెందింది. గేదె మృతితో రూ.లక్ష జరిగిందని రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
పౌల్ట్రీ ఫామ్‌లో కోడి పిల్లలు..
శివ్వంపేట(నర్సాపూర్): షార్ట్ సర్క్యూట్‌తో కోడి పిల్లలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చండీ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఉప్పరి కుమార్ పౌల్ట్రీ ఫామ్‌తో ఉపాధి పొందుతున్నాడు. కాగా ఫామ్‌లో 7 వేల కోడి పిల్లలుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి వెయ్యి వరకు కోడి పిల్లలు మృతి చెందాయి. మంటలను అదుపు చేశామని బాధితుడు తెలిపాడు.


