సబ్‌ పోస్టుమాస్టర్‌ విధుల్లో మరో వ్యక్తి | - | Sakshi
Sakshi News home page

సబ్‌ పోస్టుమాస్టర్‌ విధుల్లో మరో వ్యక్తి

Nov 20 2026 7:39 AM | Updated on Nov 20 2026 7:39 AM

అల్లాదుర్గం(మెదక్‌): అల్లాదుర్గం పోస్టాఫీసులో సబ్‌ పోస్టుమాస్టర్‌కు బదులు ఓ ప్రైవేట్‌ వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడని సంగారెడ్డి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అల్లాదుర్గం సబ్‌ పోస్టుమాస్టర్‌ విధులు నిర్వహించకుండా ఆయన స్థానంలో మరో వ్యక్తి పోస్టాఫీసులో కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు. కొందరు ఆర్డీ కట్టడానికి పోస్టాఫీస్‌కు వెళ్తే ఆన్‌లైన్‌లో కట్టుకోవాలని తిప్పి పంపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోస్టుమాస్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై అవుట్‌స్టోరింగ్‌ సిబ్బంది ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోస్టాఫీసుకు వచ్చే వారిపై దురుసుగా మాట్లాడుతూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్‌ సిబ్బందితో విధులు చేయిస్తూ, మధ్యాహ్నమే వెళ్లిపోతున్నట్లు విమర్శలున్నాయి. పోస్టుమాస్టర్‌ కూర్చీపై మరో వ్యక్తి కూర్చుని విధులు చేయడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై పోస్టుమాస్టర్‌ రఘును వివరణ కోరగా.. నా స్థానంలో ఎవరు విధులు నిర్వహించడం లేదని చెప్పారు.

అధికారులకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement