గజ్వేల్‌రూరల్: ఆవును తప్పించబోయి కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రజ్ఞాపూర్ నుంచి తూప్రాన్ మార్గంలో వెళ్తున్న ఓ కంటైనర్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా వద్ద అడ్డుగా వచ్చిన ఆవును తప్పించబోయి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన బీజేపీ నాయకులు అరవింద్ ఘటనా స్థలానికి చేరుకొని లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.


