స్టాంప్‌ పేపర్ల కొరత | - | Sakshi
Sakshi News home page

స్టాంప్‌ పేపర్ల కొరత

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

కొరత వాస్తవమే

●విద్యార్థులకు తప్పని తిప్పలు ●భూ క్రయవిక్రయాలకు ఆటంకాలు

హత్నూర(సంగారెడ్డి): స్టాంప్‌ పేపర్ల కొరతతో పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులకు స్టాంపు పేపర్లు అవసరం. మండలంలో స్టాంప్‌ వెండర్ల వద్ద 10, 20, 100 రూపాయల స్టాంప్‌ పేపర్లు కరువయ్యాయి. జిల్లాలోని పలు మండలాల్లో సైతం ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. దీంతో జిల్లా కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండు, మూడు నెలలుగా కొరత ఉన్నప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. భూములు ఇతర రిజిస్ట్రేషన్ల కోసం విలువకు సరిపడా పేపర్‌ బాండ్లు మార్కెట్లో అందుబాటులో లేవు. దీంతో మండలం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్‌తో పాటు, వారసత్వ వీలునామా, పత్రాలకు విలువైన స్టాంప్‌ పేపర్లు లేక తక్కువ వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుంది. ప్రధానంగా రూ.20, 50 పేపర్‌ బాండ్ల కొరత ఉంది. ప్రజల అవసరాలకు తగిన స్టాంప్‌ పేపర్లు లేక తమ విక్రయాలు పడిపోయాయని స్టాంప్‌ వెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక ధరలకు విక్రయం

అందుబాటులో ఉన్న స్టాంపు పేపర్లను పలుచోట్ల స్టాంప్‌ పెండర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొరతను ఆసరాగా చేసుకొని అందిన కాడికి దండుకుంటున్నారని సమాచారం. ప్రతీ లావాదేవిలో స్టాంప్‌ పేపర్లు అవసరం ఉండడంతో తప్పని పరిస్థితిలో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికై నా అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

గత కొన్ని రోజులుగా స్టాంప్‌ పేపర్ల కొరత ఉన్న మాట వాస్తవం. రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే అందుబాటులో లేవని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు. – సాయికుమార్‌,

స్టాంప్‌ వెండర్‌, దౌల్తాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement