మాట్లాడుతున్న అనూష రెడ్డి
కొండాపూర్(సంగారెడ్డి): ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ డివిజన్ అధికారి అనూషరెడ్డి సూచించారు. మండల పరిధిలోని మాచెపల్లిలోగురువారం ఎల్‌నినో, ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగు దీర్ఘకాలికంగా రైతులకు ఆదాయాన్ని ఇచ్చే పంట అని తెలిపారు. నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకోవడంతో పాటు శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేపట్టాలన్నారు. ఎరువుల యాజమాన్యం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి వినియోగం, చీడపీడల నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ గణేష్, ఏఈఓ రవి, పంచాయతీ కార్యదర్శి హంసలేఖ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ ఉద్యాన అధికారి అనూషరెడ్డి


