మున్సిపల్ చైర్మన్ యూనూస్
జహీరాబాద్: యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎం.డి.యూనూస్ పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శుక్రవారం ఎస్.ఉజ్వల్‌రెడ్డి జన్మదినం సందర్భంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు ఉచితరక్తదాన శిబిరం నిర్వహించారు. 70 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ...పలు సందర్భాల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు రక్తం దొరకని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. దీన్ని అధిగమించేందుకు యువకులు రక్తదానానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడినవారమవుతామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ శిరీషారెడ్డి, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు నర్సింహారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నాగిరెడ్డి, అరుణ్ పాల్గొన్నారు.


