పార్క్‌ భూమిని పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

పార్క్‌ భూమిని పరిరక్షించాలి

Oct 31 2026 11:03 PM | Updated on Oct 31 2026 11:03 PM

పార్క్‌ భూమిని పరిరక్షించాలి దివ్యాంగులకు సదరం శిబిరాలు ఢిల్లీ తరలివెళ్లిన కాంగ్రెస్‌ శ్రేణులు బాలల హక్కుల పరిరక్షణకు కృషి పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్‌

టీజీఐఐసీ జోనల్‌ కమిషనర్‌కు

కో ఆప్షన్‌ సభ్యుడు వినతి

పటాన్‌చెరు: పారిశ్రామిక ప్రాంతంలోని కేసీఆర్‌ పార్క్‌కు కేటాయించిన భూమిని పరిరక్షించాలని ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ కో–ఆప్షన్‌ సభ్యుడు మొహమ్మద్‌ నిజాముద్దీన్‌ బాబా కోరారు. ఈ మేరకు టీజీఐఐసీ జోనల్‌ కమిషనర్‌ ఆర్‌.విఠల్‌కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబా మాట్లా డుతూ... పార్క్‌కు కేటాయించిన సుమారు 10 ఎకరాల భూమిలో కొంత ఆక్రమణకు గురైనట్లు, పార్క్‌ స్థలం మీదుగా రహదారి నిర్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమికి సంబంధించిన సర్వే నంబర్లు, హద్దులు, ఆమోదిత లే అవుట్‌ను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఆక్రమణలు, అనధికార నిర్మాణాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంగారెడ్డి: జిల్లాలోని దివ్యాంగుల సౌకర్యార్థం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నవంబర్‌ 2026లో యూడీఐడీ సదరం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ తెలిపారు. నవంబర్‌ 4, 6, 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. ఒక్కో శిబిరానికి 200 స్లాట్లు చొప్పున మొత్తం 1,600 స్లాట్లు కేటాయించామని తెలిపారు. కొత్త సర్టి ఫికెట్‌ పొందాలనుకునేవారు, గడువు ముగిసిన సర్టిఫికెట్లను పునరుద్ధరించుకోవాలనుకునేవారు ముందుగా యూడీఐడీ పోర్టల్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. స్లాట్‌ బుకింగ్‌కు సంబంధించి ఫోన్‌కాల్‌ లేదా సందేశం అందిన అభ్యర్థులు మాత్రమే కేటాయించిన తేదీన శిబిరానికి హాజరు కావాలన్నారు. శిబిరానికి వచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్‌ రసీదు, ఆధార్‌ కార్డు, సంబంధిత వైద్య నివేదికలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు.

నారాయణఖేడ్‌: ఓట్ల తొలగింపును నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నవంబర్‌ 1న ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు తరలివెళ్లాయి. డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఖేడ్‌ ప్రాంత నాయకులు శుక్రవారం ప్రత్యేక బస్సులో బయల్దేరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..రాహుల్‌ సభలో పాల్గొనేందుకు బస్సులు, రైళ్లు, విమానాల్లో కలిపి 800 మంది వరకు తరలివెళ్తున్నట్లు తెలిపారు.

సంగారెడ్డి టౌన్‌ : బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీలేఖ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని కొత్లాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో శ్రీలేఖ పాల్గొని మాట్లాడారు. బాలలపై జరిగే హింస, లైంగిక వేధింపులు, దోపిడీ ఇతర అనుచిత చర్యలను నివారించాల్సిన అవసరముందని బాలల హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ప్రతీ బాలికకు సురక్షితమైన బాల్యం కల్పించడమే సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌ ప్రధాన లక్ష్యం అన్నారు.

జహీరాబాద్‌ టౌన్‌: పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా జహీరాబాద్‌ పట్టణానికి చెందిన అంబటి ప్రశాంత్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు కొప్పరి హరికిషన్‌ అధ్యక్షతన శుక్రవారం జిల్లాస్థాయి సమావేశంలో జరిగింది. సమావేశంలో యువజన సంఘం నూతన అధ్యక్షుడిని ప్రశాంత్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పద్మశాలీల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తనకు జిల్లా అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement