జిన్నారం (పటాన్‌చెరు): విద్యార్థి దశలోనే చట్టం, రాజ్యాంగ పరిధి, న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి పట్లోళ్ల తేజశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా దశ నుంచి సమాజంపై బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణకుమార్, న్యాయవాదులు శ్రీధర్‌రెడ్డి, బాలకృష్ణ, వెంకటరమణ, మౌనిక, రాధాభాయి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఆహార భద్రతాధికారి రాజేశ్వర్
జహీరాబాద్ టౌన్: నాసిరకం, కల్తీ పదార్థాలు విక్రహియిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రతాధికారి రాజేశ్వర్ హెచ్చరించారు. జహీరాబాద్ పట్టణంలోని హోటళ్లు, మెస్‌లు, స్వీట్స్ దుకాణాలు, నిత్యావసర సరుకుల ఏజెన్సీలపై గురువారం ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారి రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో నాణ్యతలేని ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన కూరగాయలు ఉన్నట్లు గుర్తించారు. నిత్యావసర సరకుల దుకాణాల్లో నాసిరకం టీ పొడిని సీజ్ చేసినట్లు తెలిసింది. తనిఖీల సందర్భంగా పలు హోటళ్లు, స్వీట్ షాపులు, నిత్యావసర సరుకుల ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఐఐటీహెచ్‌లో నవంబర్ 22న ఆదివారం హాఫ్ మారథాన్–2026ను నిర్వహించనున్నారు. దేశంలో తొలి పారా ఒలంపిక్ స్వర్ణ పథకం విజేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత అర్జున అవార్డు గ్రహీత మురళీకాంత్ పెట్కార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఐఐటీహెచ్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు, అధ్యాపకులు, ఐఐటీహెచ్ పూర్వవిద్యార్థులు, ఉద్యోగ నిపుణులు, అథ్లెట్లు ఫిట్‌నెస్ ప్రియులు ఈ హాఫ్ మారథాన్‌లో పాల్గొనాలని కోరారు. విజేతలకు మొదటి బహుమతి రూ.10 వేలు, రెండో బహుమతి రూ.ఏడు వేలు, మూడో బహుమతి రూ.ఐదు వేలుగా ప్రకటించారు. ఆన్‌లైన్ https://ifinish.in/running/IITHHM_2026 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
సంగారెడ్డి ఎడ్యుకేషన్: గుజరాత్‌లోని కెవడియాలో అక్టోబర్ 31న నిర్వహించనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్–2026 జాతీయ స్థాయి కార్యక్రమానికి జిల్లా నుంచి 11 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఐదుగురు సర్పంచులు ఎంపికయ్యారు. వీరిలో సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 11 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రవీణ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.


