ఎస్‌జీఎఫ్‌ పోటీలకు జోగిపేట విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ పోటీలకు జోగిపేట విద్యార్థులు

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

జోగిపేట(అందోల్‌): ఎస్‌జీఎఫ్‌ అంతర్‌ జిల్లాల క్రీడాపోటీలకు నిర్వహించిన అర్హత పోటీల్లో జోగిపేటకు చెందిన సాయికృష్ణవేణి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభను కనబరచి ఎంపికయ్యారు. అండర్‌–17 కబడ్డీ విభాగంలో సాయి చరణ్‌, మధు ఎంపిక కాగా, అండర్‌–14 విభాగంలో ప్రణీత్‌ కుమార్‌ ఎంపికయ్యారు. అదేవిధంగా బాలికల విభాగంలో శ్రీ పల్లవి అంతర్‌ జిల్లాల స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగరాజు గురువారం వెల్లడించారు. అంతర్‌ జిల్లాల స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని, తద్వారా పాఠశాలకు, జోగిపేట ప్రాంతానికి, సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement