ప్రభుత్వ భూముల్ని కాపాడుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల్ని కాపాడుతాం

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

పటాన్‌చెరు: అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పేర్కొన్నారు. అమీన్‌పూర్‌లోని వివాదాస్పద వాళ్ళ నారాయణరావు వెంచర్‌ భూములను గురువారం ఆయన పరిశీలించారు. ఇండస్ట్రియల్‌ ఎంప్లాయిస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ పరిధిలో ప్రైవేటు పట్టా భూములను తమ అప్పగించాలంటూ ఆ భూ యజమానులకు కొందరు కొంతకాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ సొసైటీ పరిధిలో ప్రైవేట్‌ భూములు పట్టా యజమానులకు ఇవ్వాలని సినా కమిటీ సూచనల మేరకు న్యాయం చేయాలంటూ భూ యజమానులు జిల్లా అధికారులకు వినతి చేసుకున్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఆ వివాదాస్పద భూములను కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిబంధన మేరకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం అడ్డుకుంటామన్నారు. కలెక్టర్‌ వెంట స్థానిక తహసీల్దార్‌ వెంకటేశం అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement