యాసంగి లేనట్లే! | - | Sakshi
Sakshi News home page

యాసంగి లేనట్లే!

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

తీవ్ర కరువు కోరల్లో కోహీర్‌, జహీరాబాద్‌ మండలాలు తేమలేక సాగుకాని శనగ, తెల్లకుసుమ, మొక్కజొన్న, జొన్న పంటలు ఎండిపోయి దిగుబడులు పడిపోతున్న పత్తి పూత దశలోనే ఎండుతున్న కంది పంట పడిపోయిన ఆలుసాగు

ఎల్‌నినో ప్రభావం యాసంగి సాగుకు గుదిబండగా మారింది. వర్షాభావ పరిస్థితుల

కారణంగా భూమిలో తేమ లేక పోవడంతో యాసంగిలో సాగు కావాల్సిన శనగ,

తెల్లకుసుమ, జొన్న, మొక్కజొన్న పంటలు సాగుకు నోచుకోలేకపోతున్నాయి. దీంతో యాసంగి పంటలపై ఆశలు సన్నగిల్లినట్లేనని తెలుస్తోంది. – జహీరాబాద్‌

సంగారెడ్డి జిల్లాలో కోహీర్‌, జహీరాబాద్‌ మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించగా, కోహీర్‌, జహీరాబాద్‌ మండలాలు తీవ్ర కరువు మండలాల జాబితాలో చేర్చింది. మిగతా మడలాలను మోడరేట్‌గా ప్రకటించింది. ఈ ఏడాది జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో వర్షాలకు వాగుల్లో నీరు ప్రవహించలేదు. చెరువుల్లోకి నీరు చేరలేదు. భూమిలో తగినంత తేమ శాతం కూడా లేదు. జిల్లాలో సాధారణ వర్షపాతం 683.4 మి.మీ కాగా, కురిసింది మాత్రం 562.3 మి.మీ నమోదైంది. 17.7 లోటు వర్షం పడింది. కోహీర్‌ మండలంలో సాధారణ వర్షపాతం 684.2 మి.మీ కాగా కురిసింది మాత్రం 398.9 మి.మీ. 41.7 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. జహీరాబాద్‌ మండలంలో సాధారణ వర్షపాతం 764.4 మి.మీ కాగా, 339.1 మి.మీ మాత్రమే వర్షం కురిసింది. దీంతో 55.6 మి.మీ లోటు వర్ష పాతం నమోదైంది.

సన్నగిల్లిన ఆశలు

జహీరాబాద్‌ డివిజన్‌ పరిధిలో రైతులు యాసంగిలో అధికంగా శనగ, తెల్లకుసుమ, జొన్న పంటలను సాగు చేస్తారు. అయితే భూమిలో తగినంత తేమ లేక పోవడంతో రైతులు యాసంగి పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. బావులు, బోర్లలో నీటి వసతులు తగ్గడం, ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో ఆలుగడ్డ పంటలు 60% మేర పడిపోయాయి. డివిజన్‌ పరిధిలో సుమారు 3వేల ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగయ్యేది. ప్రస్తుతం 900 ఎకరాలు కూడా సాగుకాన్నట్లు అంచనా. విక్రయం నిమిత్తం విత్తనం వ్యాపారులు ఆగ్రా నుంచి విత్తనం తెచ్చారు. రైతుల వైపు నుంచి డిమాండ్‌ లేకపోవడంతో తెచ్చిన విత్తనాన్ని తిరిగి వెనక్కి పంపే పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

విత్తినా మొలకెత్తని పంటలు

కోహీర్‌ మండలంలో రైతులు యాసంగి కింద కొందరు శనగ, తెల్లకుసుమ విత్తనాలు వేశారు. 10 శాతం కూడా విత్తనం మొలకెత్తలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. భూమిలో తేమ లేనందునే మొలకెత్తలేదంటున్నారు. అర్నబ్‌ తుపాన్‌ అయినా వస్తుందనే ఆశలు పెట్టుకున్నా అది కూడా కనికరించక రైతులను నిరాశపర్చింది.

వర్షాకాలం పంటలు అంతంతే

వర్షాకాలంలో సాగు చేసిన పలు పంటలు ఆశాజనకంగా లేకుండా పోయాయి. అవసరం మేరకు వర్షాలు లేక పోవడంతో పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్‌ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే పత్తి పంట ఎండిపోతున్నాయి. కంది పంట సైతం ఎండిపోయి పూతరాని పరిస్థితి ఏర్పడింది. మొక్కజొన్న పంటల దిగుబడులు పడిపోయాయి. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడులు తిరిగిరాక అప్పుల పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement