రక్తదాతలను అభినందించిన గవర్నర్‌ | - | Sakshi
Sakshi News home page

రక్తదాతలను అభినందించిన గవర్నర్‌

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

25 మందికి సర్టిఫికెట్ల ప్రదానం

జహీరాబాద్‌ టౌన్‌: ఎన్‌ఎస్‌ఎస్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీల ఆధ్వర్యంలో బుధవారం ఉస్మానియా యూనివర్శటీలో ‘నషా ముక్తి భారత్‌’కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చింతల హరికుమార్‌ ఆధ్వర్యంలో 25 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరంతా రక్తదానం చేయగా ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా వారిని అభినందించి ప్రశంసాపత్రాలను (సర్టిఫికెట్ల) అందజేశారు. ఓయూ వైస్‌ ఛాన్సలర్‌ కుమార్‌, ఎన్‌ఎన్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ చలమల వెంకటేశ్వర్లు కూడా వలంటీర్ల సేవా నిరతిని కొనియాడారు.

చట్టాలపై విద్యార్థులకు

అవగాహన ఉండాలి

సంగారెడ్డి టౌన్‌: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తి ధనలక్ష్మి పేర్కొన్నారు. సురక్షిత బచ్చన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం పలు పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు బాలల హక్కు లు, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

దళారులను నమ్మి

రైతులు మోసపోవద్దు

ఆత్మ కమిటీ చైర్మన్‌ మల్లారెడ్డి

సంగారెడ్డి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్‌ మల్లారెడ్డి సూచించారు. చౌటకూర్‌ వెండికోల్‌ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి రైతులు నష్టపోకూడదని, ధాన్యం విక్రయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గణేశ్‌, సర్పంచ్‌ మల్లారెడ్డి, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.

వ్యాధుల నివారణకు

ఉమ్మడి కృషి

డాక్టర్‌ ఫర్హాన్‌ అహ్మద్‌

పటాన్‌చెరు: నిర్లక్ష్యానికి గురవుతున్న ఉష్ణ మండల వ్యాధుల నివారణకు శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, సామాజిక పరిశోధకులు సమన్వయంతో పనిచేయాలని గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఫర్హాన్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ హ్యు మానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంస్థాగత పరిశోధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎనిమి దో పరిశోధన సదస్సు నిర్వహించారు. ‘వేడెక్కుతున్న ప్రపంచం కోసం టీకాల రూపకల్ప న.. డెంగీపై పోరాటంలో విజ్ఞానం, సమానత్వం, విధానం’అనే అంశంపై డాక్టర్‌ అహ్మద్‌ ప్రసంగించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు డెంగీ వ్యాప్తిపై చూపుతున్న ప్రభావాన్ని వివరించారు. తమ పరిశోధనల ద్వారా టీకాల భద్రత, సమర్థతకు సంబంధించిన సవాళ్లను అధిగమించే అవకాశాలున్నా యని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొని పలు సందేహాలను నివృతి చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement